హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఇలా ఉంది…

|

Aug 27, 2020 | 5:06 PM

పెట్రోల్ ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. ఒక రోజు విరామం తర్వాత గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు మాత్రం...

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర ఇలా ఉంది...
Follow us on

పెట్రోల్ ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. ఒక రోజు విరామం తర్వాత గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు మాత్రం పెరగలేదు. దీంతో హైదరాబాద్‌లో పెట్రోలు ధరలీటరుకు 85 రూపాయల మార్క్ ను దాటేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్  ధర లీటరుకు 81.83 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.48 గా ఉంది. కోల్‌కతాలో 83.33 రూపాయలు, బెంగళూరులో 84.49 రూపాయలు, హైదరాబాద్‌లో లీటరుకు 85.04 రూపాయలుగాను ఉంది. మరోవైపు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 73.56 రూపాయలు, ముంబైలో 80.11రూపాయలు, చెన్నైలో 78.86 రూపాయలు, కోల్‌కతాలో 77.06 రూపాయలు, హైదరాబాద్‌లో లీటరుకు రూ 80.17 రూపాయలు పలుకుతోంది.

 

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరు రూ. 85.04  

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరు రూ. 81.83

ముంబైలో పెట్రోల్ ధర లీటరు రూ.88.48

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరు రూ. 83.33

బెంగళూరులో పెట్రోల్ ధర లీటరు రూ. 84.49