బ్రేకింగ్: సొంత తీర్పుపైనే రివ్యూ..సుప్రీం సంచలన నిర్ణయం!

|

Oct 01, 2019 | 1:01 PM

ఎస్సీ, ఎస్టీ వేధింపుల  కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని  గతేడాది  మార్చి 20న ఇచ్చిన తీర్పును మరో రివ్యూ చేయాలని కోరుతూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. స్వేచ్ఛ, సమానత్వం కోసం వీరు చేస్తోన్న పోరాటం ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల  కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని […]

బ్రేకింగ్: సొంత తీర్పుపైనే రివ్యూ..సుప్రీం సంచలన నిర్ణయం!
Follow us on

ఎస్సీ, ఎస్టీ వేధింపుల  కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని  గతేడాది  మార్చి 20న ఇచ్చిన తీర్పును మరో రివ్యూ చేయాలని కోరుతూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. స్వేచ్ఛ, సమానత్వం కోసం వీరు చేస్తోన్న పోరాటం ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల  కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.  దీంతో  కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వ పిటిషన్​ను సుమారు 18 నెలల అనంతరం ఈ ఏడాది సెప్టెంబర్​ 13న త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు.  న్యాయమూర్తులు జస్టిస్​ అరుణ్​ మిశ్రా, జస్టిస్​ ఎంఆర్​ షా, జస్టిస్​ బీఆర్​ గవాయ్​ల త్రిసభ్య ధర్మాసనం నేడు తాజా తీర్పును వెల్లడించారు.

గతంలో సుప్రీం ఏం తీర్పు ఇచ్చింది?

ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై  ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఉపయోగిస్తూ..కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలో కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. విచారించిన కోర్టు .. వెంటనే అరెస్టు జరపకూడదని తీర్పు వెల్లడించింది. అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్​ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్​ చేయాలంటే స్పెషల్ ఆఫీసర్స్ ఆమోదం ఉండాలని పేర్కొంది.