ముడి చమురు సెగ.. సెన్సెక్స్ డీలా..

| Edited By:

Apr 21, 2020 | 5:21 PM

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల బాటపట్టాయి. చమురు ధరల పతనం, అంతర్జాతీయంగా మదుపర్ల సెంటిమెంట్

ముడి చమురు సెగ.. సెన్సెక్స్ డీలా..
Follow us on

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల బాటపట్టాయి. చమురు ధరల పతనం, అంతర్జాతీయంగా మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతినడం, కరోనా వైరస్‌ కారణంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మంగళవారం 1,011 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్‌, ఐటీ, వాహన తయారీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 30,378.07కు చేరుకున్న సెన్సెక్స్‌ 1,011.29 పాయింట్లు నష్టపోయి 30,636.71 వద్ద ముగిసింది.

కాగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 280.40 పాయింట్లు తగ్గి 8,981.45 వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ఏకంగా 12 శాతం నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఎం అండ్‌ ఎం, టాటాస్టీల్‌, ఓఎన్‌జీసీ, మారుతి అదే బాటలో నడిచాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, నెస్లె ఇండియా లాభపడ్డాయి.

మరోవైపు.. చమురు నిల్వ చేసుకొనేందుకు స్థలం లేకపోవడంతో వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్‌మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) సూచీలో ముడిచమురు ధర ఏకంగా -37.63 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే నెల డెలివరీ ధరలు బ్యారెల్‌కు 1.10 డాలర్లకు రికవరీ అయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్లను దెబ్బతీసింది.