తెలంగాణ కొత్త సచివాలయం ఏరియల్ వ్యూ… చూశారా

|

Oct 08, 2020 | 7:45 PM

తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దసరా రోజు సచివాలయ నిర్మాణానికి పనులు మొదలు కానున్నాయి. హుసేన్ సాగర్ ఒడ్డున పాత సచివాలయ స్థానంలోనే

తెలంగాణ కొత్త సచివాలయం ఏరియల్ వ్యూ... చూశారా
Follow us on

New Secretariat Aerial View : తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణ పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దసరా రోజు సచివాలయ నిర్మాణానికి పనులు మొదలు కానున్నాయి. హుసేన్ సాగర్ ఒడ్డున పాత సచివాలయ స్థానంలోనే కొత్త సచివాలయం నిర్మించనున్నారు.

ఇంటిగ్రేటెడ్ సచివాలయం ఏరియల్ వ్యూ ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 16 న బిడ్స్ ఓపెన్ కానున్నాయని వెల్లడించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ని తెలంగాణ సర్కారు ఖరారు చేసింది.

సెక్రటేరియట్ లో అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుండేలా డిజైన్ చేశారు. కొత్త సెక్రటేరియట్‌లో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్స్ కూడా అన్ని సౌకర్యాలతో ఉండనున్నాయి. ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాలు, మీటింగ్ హాలు, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉండేలా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త సచివాలయం నిర్మించడానికి వీలుగా పాత భవనాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.