అమ్మ చనిపోయినా కరోనాపై పోరాటానికి ఆ డాక్టర్..సాహో…

|

Mar 20, 2020 | 6:21 PM

ప్రస్తుతం.. ప్రపంచానికి  నిజమైన హీరోలు ఇప్పుడు డాక్టర్లే. కటౌట్లు, ప్లెక్సీలు, పాలాభిషేకాలు అవసరం లేదు..వారు ప్రపంచానికి చేస్తోన్న సేవలకు ప్రతిఫలంగా ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు మీ ఇంటి బాల్కనీలో  నిలబడి కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలపండి. ఇవి మనకోసం నిరంతరం శ్రమిస్తోన్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ద కార్మికులు, పోలీసులు, మీడియావారి సేవలకు ఒక చిన్న ఉడతా భక్తి అంతే. తాజాగా ఒడిశాలో ఓ వైద్యుడు చేసిన పని యావత్ […]

అమ్మ చనిపోయినా కరోనాపై పోరాటానికి ఆ డాక్టర్..సాహో...
Follow us on

ప్రస్తుతం.. ప్రపంచానికి  నిజమైన హీరోలు ఇప్పుడు డాక్టర్లే. కటౌట్లు, ప్లెక్సీలు, పాలాభిషేకాలు అవసరం లేదు..వారు ప్రపంచానికి చేస్తోన్న సేవలకు ప్రతిఫలంగా ఈ ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు మీ ఇంటి బాల్కనీలో  నిలబడి కరతాళ ధ్వనులతో వారికి కృతజ్ఞతలు తెలపండి. ఇవి మనకోసం నిరంతరం శ్రమిస్తోన్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ద కార్మికులు, పోలీసులు, మీడియావారి సేవలకు ఒక చిన్న ఉడతా భక్తి అంతే.

తాజాగా ఒడిశాలో ఓ వైద్యుడు చేసిన పని యావత్ దేశాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. తన మాతృమూర్తి చనిపోయిన సరే..వైద్య సేవలు అందించారు ఆ డాక్టర్. తల్లి చిన్నప్పటి నుంచి పంచిన మధుర జ్ఞాపకాలు వెంటాడుతూ గుండెల్లో కన్నీరు ఉబికివస్తోన్నా.. వాటిని దిగమింగుతూ ఆయన కరోనా మహమ్మారిపై పోరాటానికి వెళ్లారు. ఆ డాక్టర్ పేరు అశోక్ దాస్. ఒడిశాలోని సంబల్పూర్‌లో కోవిడ్-19 నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ, వారికి చికిత్స అందించడం ఆయన విధి. అయితే ఈ మంగళవారం ఆయన తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. అయినా అత్యవసర పరిస్థితులు దృష్ట్యా ఆయన వృత్తి ధర్మాన్ని వీడలేదు. ఆస్పత్రికి వెళ్లి డ్యూటి చేసి సాయంత్రం వచ్చి తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ ప్రజా సేవే ముఖ్యమని అమ్మ చెప్పిన మాటలే..తనను డ్యూటి వెళ్లేలా చేశాయని కన్నీటి పర్యంతమయ్యారు అశోక్. ఆయన సేవల పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అశోక్ విధి పట్ల చూపించిన అంకిత భావాన్ని ప్రశంసించింది.