ఎన్ఆర్ఐ సంబంధం..పెళ్లైన మూడు రోజుల్లోనే వ‌రుడు ‘గే’ అని తెలిసి…

ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు అలెర్ట్. పిల్ల పెళ్లి కొచ్చింద‌ని మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూసి పెళ్లి చేయాల‌నుకోకండి. అక్క‌డికి వెళ్లి సెటిల్ అయిన‌వాళ్ల అల‌వాట్లు, క‌ట్టుబాట్లు ఎలా ఉన్నాయో ఒక‌టికి పదిసార్లు చెక్ చేసుకోండి.

ఎన్ఆర్ఐ సంబంధం..పెళ్లైన మూడు రోజుల్లోనే వ‌రుడు 'గే' అని తెలిసి...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 2:46 PM

ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు అలెర్ట్. పిల్ల పెళ్లి కొచ్చింద‌ని మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూసి పెళ్లి చేయాల‌నుకోకండి. అక్క‌డికి వెళ్లి సెటిల్ అయిన‌వాళ్ల అల‌వాట్లు, క‌ట్టుబాట్లు ఎలా ఉన్నాయో ఒక‌టికి పదిసార్లు చెక్ చేసుకోండి. లేదంటే ఆడపిల్ల నిండు జీవితం నాశనం అవుతుంది. తాజాగా గుంటూరులో ఇటువంటి ఘ‌రానా మోసమే వెలుగులోకి వ‌చ్చింది.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప‌నిచేస్తున్న భాస్కర్ రెడ్డికి ఏటి అగ్రహారంకు చెందిన అమ్మాయిని ఇచ్చి ఘ‌నంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లైన నెల రోజుల త‌ర్వాత భార్య త‌న‌కు ఇష్టం లేదంటూ అమెరికా వెళ్లిపోయాడు భాస్క‌ర్ రెడ్డి. కాగా పెళ్లైన మూడు రోజుల్లోనే తాను గే అని..త‌న‌కు అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడ‌ని భార్య‌కు చెప్పాడు భాస్క‌ర్ రెడ్డి. దీంతో ఏం చెయ్యాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డింది వ‌ధువు. కాగా పెళ్ళి సమయంలో యాభై ఐదు సవర్ల బంగారం, యాభై లక్షల నగదు కట్నంగా ఇచ్చారు వధువు తల్లిదండ్రులు. తాజాగా అద‌న‌పు క‌ట్నం కావాలంటూ వధువును వేధించ‌డం మొద‌లుపెట్టారు భాస్క‌ర్ రెడ్డి పేరెంట్స్. వేధింపులు ఎక్కువవ్వ‌డంతో అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్పి అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది బాధితురాలు.

Read More : ట్విట్టర్​లో మహేశ్​ ఫ్యాన్స్ సునామి.. పవన్ రికార్డు బ్రేక్..!