ఇకపై ప్యాన్ కార్డు ఉచితంగా పొందవచ్చు.. కేవలం 10 నిమిషాల్లోనే..

|

Nov 07, 2019 | 8:53 PM

ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో.. మనకి ప్యాన్ కార్డు కూడా అంటే ముఖ్యం. ప్యాన్ కార్డు పొందాలంటే దాదాపు 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. పలు డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయాలి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఈ-ప్యాన్ కార్డును ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. ఈ ఫెసిలిటీని ఐటీ శాఖ త్వరలోనే ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది. ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివరాలు […]

ఇకపై ప్యాన్ కార్డు ఉచితంగా పొందవచ్చు.. కేవలం 10 నిమిషాల్లోనే..
Follow us on

ప్రతి చిన్న అవసరానికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో.. మనకి ప్యాన్ కార్డు కూడా అంటే ముఖ్యం. ప్యాన్ కార్డు పొందాలంటే దాదాపు 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. పలు డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయాలి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా కేవలం 10 నిమిషాల్లో ఈ-ప్యాన్ కార్డును ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు. ఈ ఫెసిలిటీని ఐటీ శాఖ త్వరలోనే ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది. ఆధార్ డేటాబేస్‌లో ఉన్న వివరాలు ప్రకారం ఈ-ప్యాన్ కార్డు జారీ చేయాలని ఆదాయపన్ను శాఖ విధివిధానాలను రూపొందిస్తోంది.

ఈ కొత్త విధానం రావడం వల్ల కేవలం 10 నిమిషాల్లోనే ప్యాన్ కార్డు ఆన్లైన్ ద్వారా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఈ ప్యాన్‌ను మనం ఉచితంగా పొందవచ్చు. ఇకపోతే ఈ కొత్త ఫెసిలిటీ సహాయంతో గతం వారం 62,000 ఈ-ప్యాన్ కార్డులను జారీ చేసినట్లు సమాచారం. కొద్దిరోజుల్లో ప్రజలు అందుబాటులోకి వచ్చే ఈ విధానంతో లేనివారు కొత్త ప్యాన్ కార్డులను.. ఉన్నవారు కావాలంటే డూప్లికేట్ ప్యాన్ కార్డులను సైతం సులభంగా ఇంటి దగ్గర నుంచే పొందవచ్చు.

ఈ-ప్యాన్ కార్డును పొందాలంటే మొదటగా మీ ఆధార్ నెంబర్‌‌తో రిజిస్టర్ అవ్వాలి. ఇక ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే.. మీ ఆధార్ వివరాలు వెరిఫై అయ్యి.. ఈ-ప్యాన్ కార్డు జారీ అవుతుంది. దీనికి ఎలాంటి డాక్యూమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.  మీ వివరాలు, డిజిటల్ సిగ్నేచర్‌ సైతం ఆధార్ డేటాబేస్‌లో ఉండటం వల్ల ప్రత్యేకంగా వేరే వివరాలను వెల్లడించాల్సి అవసరం లేదు.