Now Arrest Me: మీరు అవినీతి చక్రవర్తి.. మీకు వ్యతిరేకంగా పోస్టుపెడుతున్నా.. ఆరెస్ట్ చేయండి సీఎంకు తేజస్వి సవాల్

|

Jan 22, 2021 | 2:15 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రతిపక్ష నేత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోషల్ మీడియా వేదికగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ సవాల్...

Now Arrest Me: మీరు అవినీతి చక్రవర్తి.. మీకు వ్యతిరేకంగా పోస్టుపెడుతున్నా.. ఆరెస్ట్ చేయండి సీఎంకు తేజస్వి సవాల్
Follow us on

Now Arrest Me: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ప్రతిపక్ష నేత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోషల్ మీడియా వేదికగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ సవాల్ విసిరారు. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం నితీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కించపరుస్తూ.. అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడితే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ తేజస్వి యాదవ్ మండిపడ్డారు. సీఎం నిర్ణయం సరైందికాదంటూ తన ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఘాటు విమర్శలు చేశారు.

నితీష్ అవినీతి భీష్మ పితామహ అంటూ విమర్శ చేసిన తేజస్వి యాదవ్.. మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ చేశాను.. దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సీఎం కు సవాల్ విసిరారు. అంతేకాదు.. నితీష్ అవినీతి చక్రవర్తి, 60 కుంభకోణాల్లో నేరస్తుడు, అవినీతి భీష్మ పితామహుడు, క్రిమినల్స్ ని కాపాడేవాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వంలో బలహీన ముఖ్యమంత్రి నితీష్ అంటూ ఎద్దేవా చేశారు. అసలు బీహార్ పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారని.. లిక్కర్ అమ్ముతున్నారని అన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే చర్యలు తీసుకోవాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకే తనను అరెస్ట్ చేయాలని నితీశ్ కి సవాల్ విసురుతున్నా’ అని ట్వీట్ చేశారు. ప్రపక్ష నేతల వద్దకు ప్రజలు తమ కష్టాలు చెప్పుకోకుండా చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Also Read: ఆ దేశంలో ఉద్యోగులకు వారానికి మూడు రోజుల సెలవులు.. చట్టం చేయడానికి రాజకీయనేతలు డిమాండ్