Daggubati family : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. కథను సిద్ధం చేస్తున్న దర్శకుడు..

|

Dec 28, 2020 | 7:48 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. చాలా కాలంతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్..

Daggubati family : దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్.. కథను సిద్ధం చేస్తున్న దర్శకుడు..
Follow us on

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. చాలా కాలంతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మరోసారి మల్టీస్టారర్ సినిమాలకు ఉపిరిపోసారు. ఇక తెలుగులో మల్టీస్టారర్ సినిమాలంటే ముందు గుర్తోచేది దగ్గుబాటి హీరో వెంకటేష్. ఇప్పటికే చాలామంది యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేసారు వెంకీ.

తాజాగా ‘శతమానం భవతి’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఇప్పుడు దగ్గుబాటి హీరోలతో మల్టీస్టారర్ చేయాలని ప్రయత్నిస్తున్నారట. ఇదే విషయాన్ని టాప్ ప్రొడ్యుసర్ సురేష్ బాబుకు కూడా చెప్పారట సతీష్. వెంకటేష్- రానాలతో సినిమా చేయాలని ఎప్పటినుంచో సురేష్ బాబు ఎదురుచుస్తున్నారు. గతంలోనూ వెంకటేష్- రానాలతో మల్టీస్టారర్ చేస్తానని సురేష్ బాబు తెలిపారు. దాంతో వెంకటేష్-రానా సినిమాకోసం కథను సిద్దం చేసేపనిలోపడ్డాడట సతీష్ వేగేశ్న. కథ నచ్చితే ఈ ప్రాజెక్ట్ ను సురేష్ బాబు సెట్స్ పైకి తీసుకువెళ్తారని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..