No Time to Die: జేమ్స్ బాండ్ సినిమాకు కరోనా కష్టాలు!

| Edited By:

Mar 05, 2020 | 6:15 PM

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఇప్పుడు ఈ మహమ్మారి ప్రభావం సినిమాలపై కూడా పడుతోంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. 25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’

No Time to Die: జేమ్స్ బాండ్ సినిమాకు కరోనా కష్టాలు!
Follow us on

No Time to Die: చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనా వైరస్. ఇప్పుడు ఈ మహమ్మారి ప్రభావం సినిమాలపై కూడా పడుతోంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటి వరకు 24 సినిమాలు వచ్చాయి. 25వ సినిమాగా ‘నో టైమ్‌ టూ డై’ సినిమా తెరకెక్కింది. డేనియల్ క్రేగ్ జేమ్స్ బాండ్‌గా నటిస్తోన్న 5వ సినిమా. ఏదైనా సిరిస్‌లో 24 సీక్వెల్స్ రావడం అంటే మాటలు కాదు. ఒక కేరెక్టర్ 56 ఏళ్లుగా ప్రపంచ ప్రేక్షకులను అలరించడం ఆషామాషీ కాదు.

ఎంతో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి జేమ్స్ బాండ్ సినిమాలు.ఈ సినిమా తర్వాత జేమ్స్ బాండ్ సినిమాలకు డేనియల్ క్రేగ్ గుడ్‌బై చెప్పనున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల కరోనా వైరస్ (కోవిడ్ -19) ప్రభావం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు థియేటర్స్‌కు రావాలంటనే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా విడుదల చేస్తే వచ్చే కలెక్షన్లు రావు.

మరోవైపు, కరోనా వైరస్ ప్రభావం తగ్గాక ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఏకంగా ఈ సినిమా విడుదలను ఏడు నెలలు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 12 యూకేలో, నవంబర్ 25 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో సందడి చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

[svt-event date=”05/03/2020,5:58PM” class=”svt-cd-green” ]