వాహనదారులకు అలర్ట్: నో మాస్క్… నో పెట్రోల్…

| Edited By:

Apr 13, 2020 | 8:01 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.

వాహనదారులకు అలర్ట్: నో మాస్క్... నో పెట్రోల్...
Follow us on

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లాలో ప్రజలందరూ మాస్కులు ధరించాల్సిందేనని అధికారులు నిబంధన విధించారు. ఈ నిబంధన సోమవారం నుంచే అందుబాటులోకి వస్తుందని కూడా ప్రకటించేశారు. ఇదే రకమైన నిబంధనలు పాట్నాతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో కూడా విధించారు.

కాగా.. భగల్‌పూర్ రేంజ్ డీఐజీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భగల్‌పూర్ ప్రాంతంలో ప్రజలందరూ మాస్కులు ధరించాలన్న నిబంధనను కఠినతరం చేశామని ప్రకటించారు. భగల్‌పూర్, పాట్నా ప్రాంతాల్లో ఉండే పెట్రోల్ డీలర్లు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించి వస్తేనే పెట్రోలు పోస్తామని, లేదంటే పెట్రోల్ పోయమని తేల్చి చెబుతున్నారు. వీటితో పాటు ముజఫర్‌ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం కూడా నిషేధించారు.

మరోవైపు.. ముజఫర్ పూర్, ముంగేర్, ఖంగారియా, పూర్ణియా, బేగుసరాయ్ ప్రాంతాల్లో గుట్కా, సిగరేట్లతో పాటు పొగాకు విక్రయాలపై కూడా నిషేధం విధించారు. ఈ నిబంధనలను కాదని పొగాకు ఉత్పత్తులను అమ్మితే రెండు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ఆయా జిల్లా కలెక్టర్లు అధికారికంగా ప్రకటించారు.