బ్రేకింగ్ : ఎయిర్‌పోర్టులో మాజీ సీఎంలకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదు..!

| Edited By:

Jun 15, 2019 | 12:39 PM

ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో చంద్రబాబు ప్రొటోకాల్ వివాదం కాకరేపుతోంది. దీంతో తమ విధివిధానాలను ప్రకటించింది బోర్డు ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. గవర్నర్, సీఎంకు మాత్రమే వీఐపీ ఎంట్రీ ఉంటుందని, మాజీ ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదని తెలిపింది. ఎయిర్‌పోర్టులో జెడ్ ప్లస్ కేటగిరీతో సంబంధంలేదని, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంటుందని బోర్డు ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ సీఎం చంద్రబాబుని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తనిఖీలు చేసిన విషయం […]

బ్రేకింగ్ : ఎయిర్‌పోర్టులో మాజీ సీఎంలకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదు..!
Follow us on

ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో చంద్రబాబు ప్రొటోకాల్ వివాదం కాకరేపుతోంది. దీంతో తమ విధివిధానాలను ప్రకటించింది బోర్డు ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. గవర్నర్, సీఎంకు మాత్రమే వీఐపీ ఎంట్రీ ఉంటుందని, మాజీ ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎంట్రీ ఉండదని తెలిపింది. ఎయిర్‌పోర్టులో జెడ్ ప్లస్ కేటగిరీతో సంబంధంలేదని, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సీఐఎస్‌ఎఫ్ ఆధీనంలో ఉంటుందని బోర్డు ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.

శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ సీఎం చంద్రబాబుని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తనిఖీలు చేసిన విషయం విదితమే. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీఐపీ, జెడ్‌ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబును తనిఖీ చేయాల్సిన అవసరమేముందని..? అలాగే ప్రత్యేక వాహనం కూడా ఎందుకు కేటాయించలేదని ఎయిర్ పోర్టు అధికారుల తీరును ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన బోర్డు ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ పై విధంగా సమాధానం ఇచ్చింది.