పోలవరంపై సీబీఐ విచారణ అవసరం లేదు: కేంద్రమంత్రి

| Edited By:

Jul 15, 2019 | 8:07 PM

పోలవరం ప్రాజెక్ట్ అవకతవకలపై రాజ్యసభలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌లో నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతకలు జరిగాయంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రకటించిందని.. విభజనచట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గజేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు పోలవరంలో 60శాతం […]

పోలవరంపై సీబీఐ విచారణ అవసరం లేదు: కేంద్రమంత్రి
Follow us on

పోలవరం ప్రాజెక్ట్ అవకతవకలపై రాజ్యసభలో కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌లో నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతకలు జరిగాయంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా కేంద్రం ప్రకటించిందని.. విభజనచట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గజేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు పోలవరంలో 60శాతం వరకు పనులు పూర్తి అయ్యాయని, ఇంతవరకు జరిగిన ఈ పనులు, పునరావాస కార్యక్రమాలో గానీ, ఇతర ప్యాకేజీల్లో అవినీతి జరిగినట్లు తమకు నివేదిక రాలేదని.. కాబట్టి దీనిపై సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

పోలవరంకు సంబంధించి సోమవారం రాజ్యసభలో ప్రశ్నల పరంపర కొనసాగింది. వైసీపీ ఎంపీలు, బీజేపీ సభ్యులు జీవీఎల్‌తో పాటు పలువురు సభ్యులు.. పోలవరంపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు అంచనాలను పంపిచకుండా రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ ఆమోదానికి పంపించాల్సిన ఆవశ్యకత ఏంటని? దీనివలన మరింత కాలయాపన జరిగే అవకాశం ఉందని.. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ షెకావత్ సమాధానం ఇచ్చారు.