WHO report ఇండియా సేఫ్… కమ్యూనిటీ వ్యాప్తి లేదు

|

Apr 10, 2020 | 3:34 PM

భారతదేశంలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లెవెల్లో వుందటూ ప్రకటించి యావత్ నూట 35 కోట్ల మంది భారతీయుల్లో కలవరం రేపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ ((WHO) తాజాగా తాము తప్పుగా అంఛనా వేశామని అంగీకరించింది.

WHO report ఇండియా సేఫ్... కమ్యూనిటీ వ్యాప్తి లేదు
Follow us on

No community transmission in India, says WHO: భారతదేశంలో కరోనా వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లెవెల్లో వుందటూ ప్రకటించి యావత్ నూట 35 కోట్ల మంది భారతీయుల్లో కలవరం రేపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ ((WHO) తాజాగా తాము తప్పుగా అంఛనా వేశామని అంగీకరించింది. తాము చేసిన తప్పును అంగీకరిస్తూ.. భారత్ ఒకింత సేఫ్ జోన్‌లోనే వుందని ప్రకటించింది. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (మూడో దశ) లెవల్‌కు చేరుకోలేదని తాజాగా శుక్రవారం నివేదిక వెలువరించింది.

చైనాలో మొదలైన కరోనాను ఆలస్యంగా గుర్తించి.. ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలోను జాప్యం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా తమ తప్పులను కొనసాగిస్తూనే వుంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరును తప్పుపడుతున్న తరుణంలోనే ఆ సంస్థ పనితీరు ఏ మాత్రం మెరుగు పడకపోగా.. మరింత దిగజారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా వారం క్రితం మన దేశం విషయంలో తాము తొందరపాటు రిపోర్టు ఇచ్చామని అంగీకరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని తేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. గతంలో ఇచ్చిన నివేదికలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందని పేర్కొనడం తమ తప్పిదమేనని అంగీకరించింది డబ్ల్యూహెచ్ఓ. అది పొరపాటుగా అంగీకరిస్తూ సవరణ చేసింది. దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులున్నాయని వివరణ ఇచ్చింది. అయితే.. భారత్‌కు కరోనా ముప్పు లేదని భావిస్తే అది పొరపాటేనని… ఈ దశలోనే కరోనాను పూర్తిగా నియంత్రించాల్సి వుందని WHO సూచించింది. లాక్ డౌన్ అయినా.. మరే ఇతర నియంత్రణా చర్యలైనా మరింత పకడ్బందీగా కొంతకాలం కొనసాగిస్తే.. కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకోలేదని సలహా ఇచ్చింది.