ప్లాస్టిక్ కాదు.. మట్టి పాత్రలు.. కేంద్ర మంత్రి ఆదేశాలు

| Edited By:

Aug 28, 2019 | 8:47 AM

దేశంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాలని.. పర్యావరణాన్ని రక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని ఇప్పటికే కొన్ని సంస్థలు, సంఘాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణా, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నితిన్ గడ్కరీ లేఖలు రాశారు. ఇకపై రైల్వే స్టేషన్లు, బస్ట్‌స్టాప్‌లలో అన్ని షాపుల్లో తినుబండారాలకు ఉపయోగించే ప్లాస్టిక్ కప్పుల బదులు మట్టి పాత్రలు, కుండలు వాడాలని ఆయన లేఖలో కోరారు. ‘‘మట్టి […]

ప్లాస్టిక్ కాదు.. మట్టి పాత్రలు.. కేంద్ర మంత్రి ఆదేశాలు
Follow us on

దేశంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాలని.. పర్యావరణాన్ని రక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని ఇప్పటికే కొన్ని సంస్థలు, సంఘాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రవాణా, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నితిన్ గడ్కరీ లేఖలు రాశారు. ఇకపై రైల్వే స్టేషన్లు, బస్ట్‌స్టాప్‌లలో అన్ని షాపుల్లో తినుబండారాలకు ఉపయోగించే ప్లాస్టిక్ కప్పుల బదులు మట్టి పాత్రలు, కుండలు వాడాలని ఆయన లేఖలో కోరారు. ‘‘మట్టి కుండలు, మట్టి వస్తువులు వాడి… వాటిని తయారుచేసే… కుమ్మరి వర్గాల జీవితాల్లో వెలుగు నింపండి’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

ఈ ఆదేశాల ప్రకారం ఇకపై రైల్వేస్టేషన్లు, బస్టాప్‌ల దగ్గర ఉండే హోటళ్లు, ఇతర షాపుల్లో పేపర్ ప్లేట్లు, పేపర్ కప్పుల బదులు మట్టి పాత్రలు, కుండల్ని ఉపయోగించాల్సిందే. ఇది పక్కాగా అమలయ్యేందుకు… రైల్వే శాఖ మంత్రికి కూడా గడ్కరీ లేఖ పంపారు. అలాగే దేశంలోని అన్ని రవాణా శాఖల మంత్రులకూ ఈ లేఖలు వెళ్లాయి. ఒకవేళ ఇది అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది కుమ్మరి వర్గాల వారికి ఉపాధి లభించడంతో పాటు… పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.