తెలుగు రాష్ట్రాలకు షాక్.. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రం జోక్యం!

| Edited By:

Nov 28, 2019 | 1:52 AM

టీఎస్‌ఆర్‌టీసీ సమస్యలను పరిష్కరించడానికి, ఉద్యోగులకు న్యాయం జరిగేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రయివేటీకరించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని అయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు. వారు ఆర్టీసీ ఉద్యోగుల భవితవ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో […]

తెలుగు రాష్ట్రాలకు షాక్.. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేంద్రం జోక్యం!
Follow us on

టీఎస్‌ఆర్‌టీసీ సమస్యలను పరిష్కరించడానికి, ఉద్యోగులకు న్యాయం జరిగేందుకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణకు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రయివేటీకరించాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అని అయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మంగళవారం కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు. వారు ఆర్టీసీ ఉద్యోగుల భవితవ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కోరారు. తరువాత వారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.

టీఎస్‌ఆర్‌టీసీలో కేంద్ర ప్రభుత్వం 33 శాతం వాటాను కలిగి ఉందని, అందువల్ల సంస్థను, దాని ఉద్యోగులను రక్షించడం తన కర్తవ్యం అని ఉత్తం అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా దాదాపు 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారని ఆయనతెలిపారు. “కేంద్రం సంస్థకు న్యాయంచేయాలి” అని ఆయన విన్నవించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించడం లేదని, కార్మికులను బేషరతుగా విధుల్లో చేరేందుకు అనుమతించడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు.