ఇది రైతు భారత్: నిర్మలా సీతారామన్

| Edited By:

Feb 01, 2020 | 2:04 PM

కేంద్ర బడ్జెట్‌లో భాగంగా.. రైతులకు చేయూతనందించేందుకు భారీగా బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్‌లో రెండోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని, వ్యవసాయ అభివృద్ధికి 16 అంశాలతో కార్యాచరణ చేపట్టారు. కాగా.. నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించామని, కరువు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా […]

ఇది రైతు భారత్: నిర్మలా సీతారామన్
Follow us on

కేంద్ర బడ్జెట్‌లో భాగంగా.. రైతులకు చేయూతనందించేందుకు భారీగా బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్‌లో రెండోసారి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని, వ్యవసాయ అభివృద్ధికి 16 అంశాలతో కార్యాచరణ చేపట్టారు. కాగా.. నీటి లభ్యత లేని 100 జిల్లాలను గుర్తించామని, కరువు జిల్లాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలియజేశారు. రైతులకు సోలార్‌ పంప్‌ సెట్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆధునిక వ్యవసాయానికి ప్రోత్సాహంతో పాటు, 20 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు అందిస్తామన్నారు. జీడీపీలో రుణాల శాతం 48.7 చేరిందన్నారు.