బ్రేకింగ్: నిర్భయ దోషి ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు!

|

Jan 29, 2020 | 11:27 AM

Nirbhaya Rape Case: నిర్భయ దోషి ముకేశ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17న అతడి క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించగా.. దీనిపై ఆర్టికల్ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోర్టు పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఇక ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టిపారేసింది. అంతకముందు వచ్చిన వార్తల ప్రకారం ఫిబ్రవరి 1న నిర్భయ నిందితుల ఉరితీత జరగకపోవచ్చునని వెల్లడైంది. ఈ కేసులో మరిన్ని చిక్కులు […]

బ్రేకింగ్: నిర్భయ దోషి ముకేశ్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీమ్ కోర్టు!
Follow us on

Nirbhaya Rape Case: నిర్భయ దోషి ముకేశ్ సింగ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17న అతడి క్షమాభిక్ష అభ్యర్ధనను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించగా.. దీనిపై ఆర్టికల్ 32 కింద న్యాయపరమైన రివ్యూ కోర్టు పిటీషన్‌ను దాఖలు చేశాడు. ఇక ఆ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి బోబ్డేతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కొట్టిపారేసింది. అంతకముందు వచ్చిన వార్తల ప్రకారం ఫిబ్రవరి 1న నిర్భయ నిందితుల ఉరితీత జరగకపోవచ్చునని వెల్లడైంది.

ఈ కేసులో మరిన్ని చిక్కులు ఉన్న కారణంగా వాయిదా పడవచ్చునని కూడా తెలుస్తోంది. ముకేశ్ వాదనలు సరైనవి కాదని.. జైలులో దోషి ఎదుర్కుంటున్న బాధను ఆధారంగా తీసుకుని క్షమాభిక్ష తిరస్కరణను సవాల్ చేయడం కరెక్ట్ కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. తాను జైల్లో వేధింపులకు గురయ్యానని దోషి చెప్పినంత మాత్రాన రాష్ట్రపతి నిర్ణయాన్ని సమీక్షించలేమని పేర్కొంది.