నిర్భయ దోషి వినయ్‌శర్మ అభ్యర్ధన తిరస్కరణ

|

Feb 01, 2020 | 12:40 PM

Nirbhaya Rape Case: నిర్బయ దోషి వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించారు. వాస్తవానికి ఈ నలుగురు నిందితులకు ఇవాళ ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టు ఉరి శిక్షను వాయిదా వేసింది. మరోవైపు నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ని అని పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు […]

నిర్భయ దోషి వినయ్‌శర్మ అభ్యర్ధన తిరస్కరణ
Follow us on

Nirbhaya Rape Case: నిర్బయ దోషి వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తిరస్కరించారు. వాస్తవానికి ఈ నలుగురు నిందితులకు ఇవాళ ఉరి శిక్ష అమలు చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కోర్టు ఉరి శిక్షను వాయిదా వేసింది.

మరోవైపు నేరం జరిగినప్పుడు తాను మైనర్‌ని అని పవన్ గుప్తా వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరి కన్ఫామ్ అనుకున్నారు. కానీ దోషులు నలుగురూ కూడా మళ్లీ ట్రయిల్ కోర్టును ఆశ్రయించారు. తమ నలుగురికీ ఇంకా న్యాయపరమైన ప్రయత్నాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, అందుకే  చిట్టచివరి అవకాశం ఇవ్వాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, మరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనను పెట్టుకున్నాడు. ఇప్పటికే ఇద్దరి క్షమాభిక్ష అభ్యర్థనలను రాష్ట్రపతి తిరస్కరించిన సంగతి తెలిసిందే. చట్టపరమైన లొసుగులన్నింటిని ఉపయోగించుకుని నిందితులు ముఖేష్, వినయ్ శర్మలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు చాలావరకూ ప్రయత్నిస్తున్నారు. అక్షయ్ ఠాకూర్ క్యూరేటివ్ పిటిషన్‌ని కొట్టేయడంతో.. చివరి అవకాశంగా రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్నాడు. దీనితో ఇక పవన్ గుప్తా మాత్రమే మిగిలాడు.