నిర్భయ కేసు ట్విస్ట్: నేను క్షమాభిక్ష కోరలేదు..!!

| Edited By:

Dec 08, 2019 | 8:40 AM

‘దిశ’ హత్యాచార ఘటనతో.. మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా.. నిర్భయ ఘటనకు సంబంధించి.. ఓ నిందితుడి క్షమాభిక్షను కూడా.. రద్దు చేశారు రాష్ట్రపతి. దీంతో.. వారికి ఎప్పుడు ఉరి పడుతుందా అంటూ.. అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ కేసులో.. […]

నిర్భయ కేసు ట్విస్ట్: నేను క్షమాభిక్ష కోరలేదు..!!
Follow us on

‘దిశ’ హత్యాచార ఘటనతో.. మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా.. నిర్భయ ఘటనకు సంబంధించి.. ఓ నిందితుడి క్షమాభిక్షను కూడా.. రద్దు చేశారు రాష్ట్రపతి. దీంతో.. వారికి ఎప్పుడు ఉరి పడుతుందా అంటూ.. అందరూ ఎదురు చూస్తున్నారు.

కాగా.. ఈ కేసులో.. అనుకోకుండా.. ఓ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. వినయ్‌ శర్మ అనే వ్యక్తి పేరిట.. ఓ క్షమాపణ పత్రం.. గవర్నర్ వద్దకు అలాగే.. రాష్ట్రపతి వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే.. ఆ లెటర్‌తో నాకు సంబంధం లేదని.. తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోదని అతను చెబుతుండటం గమనార్హం. అయితే.. మరి ఇది ఎవరు చేశారనే అనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.