బిగ్ బ్రేకింగ్ : నిర్భయ కేసు నిందితులకు ఉరి ఖరారు..!

| Edited By: Srinu

Dec 09, 2019 | 1:33 PM

నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో  నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేయనున్నారు. 2012 డిసెంబర్‌ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని గాయపరిచి, అత్యంత హేయంగా ఢిల్లీ విధుల్లో బస్సులో తిప్పుతూ ఆమెను […]

బిగ్ బ్రేకింగ్ : నిర్భయ కేసు నిందితులకు ఉరి ఖరారు..!
Follow us on

నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో  నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేయనున్నారు.

2012 డిసెంబర్‌ 16న మృగాళ్లు నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని గాయపరిచి, అత్యంత హేయంగా ఢిల్లీ విధుల్లో బస్సులో తిప్పుతూ ఆమెను చెరపట్టారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రాహావేశాలు చెలరేగాయి. ఈ కేసులో మైనర్‌ సహా ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఐతే ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ కేసు విచారణ జరుగుతుండగానే 2013 మార్చి 11న తీహార్‌ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మైనర్‌‌కు జువైనల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. అది పూర్తయిన అనంతరం అతడు 2015 డిసెంబర్‌ 20న విడుదలయ్యాడు. మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఐతే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి 2017 మే 5న హైకోర్టు విధించిన ఉరి శిక్షనే సమర్ధించింది. చివరి ప్రయత్నంగా  నిందితులు రాష్ట్రపతికి క్షమాబిక్ష పెట్టుకున్నారు. కానీ అటువంటి మృగాళ్లను కనికరించవద్దని ఢిల్లీ ప్రభుత్వం ప్రెసిడెంట్‌ను అభ్యర్థించింది. దీంతో రాష్ట్రపతి కోవింద్ కూడా క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించడంతో ఉరిశిక్ష ఖరారు అయినట్లు తెలుస్తోంది.