ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!

| Edited By:

Aug 17, 2020 | 10:27 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ షెల్టరు హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా సోకిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ పట్టణంలో వెలుగుచూసింది.

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!
Follow us on

Govt Shelter Home Girls: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ షెల్టరు హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా సోకిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ పట్టణంలో వెలుగుచూసింది. బరేలీ పట్టణంలోని నారీ నికేతన్‌లో నివాసముంటున్న 90 మంది బాలికలకు కరోనా పాజిటివ్ అని తేలిందని మహిళా సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టరు నీతా అహిర్వార్ చెప్పారు. కరోనా సోకిన బాలికలందరినీ ఐసోలేషన్ చేశామని నీతా చెప్పారు. నారీ నికేతన్ లో బాలికలకు కరోనా ఎలా సోకిందన్న విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నారీ నికేతన్ ను శానిటైజ్ చేయించారు.

Also Read: సోమాలియాలో ఉగ్రదాడి.. 17 మంది మృతి..!