Hero Nikhil: తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్న హీరో నిఖిల్… కోవిడ్ కారణంగా వాయిదా పడింది అంటూ పోస్ట్..

|

Jan 25, 2021 | 8:38 PM

Nikhil Gifts Car Him Self: ‘హ్యాపీడేస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు యంగ్ హీరో నిఖిల్. అనంతరం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాన్ని..

Hero Nikhil: తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకున్న హీరో నిఖిల్... కోవిడ్ కారణంగా వాయిదా పడింది అంటూ పోస్ట్..
Follow us on

Nikhil Gifts Car Him Self: ‘హ్యాపీడేస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు యంగ్ హీరో నిఖిల్. అనంతరం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. నిఖిల్ నటించిన ఏకంగా ఏడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయితే 2013లో వచ్చిన ‘స్వామి రారా’ చిత్రం నిఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఈ సినిమా విజయంతో ఒక్కసారిగా నిఖిల్ కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అనంతరం వచ్చిన ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ సినిమా ఎంపికలో కూడా మార్పు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. నిఖిల్ తనకు తాను ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చుకున్నాడు. సుమారు రూ. కోటి 80 లక్షల విలువ చేసే ‘రేంజ్ రోవర్’ కారులో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇక ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘రేంజ్ రోవర్ స్పోర్ట్ ఆటోబయోగ్రఫీ కారు.. ఈ కారు ‘అర్జున్ సురవరం’ విజయానికి నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్. కరోనా కారణంగా ఇది కాస్త ఆలస్యమైంది’ అంటూ క్యాప్షన్ జోడించాడు.

Also Read: సింగర్ సునీత-రామ్‌ల ‘వెడ్డింగ్ ఫిల్మ్ టీజర్’.. అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..