Niharika: ‘మాస్టర్’పై పొగడ్తల వర్షం కురిపించిన మెగా డాటర్‌.. విజయ్‌ సార్‌ నా ఫేవరేట్‌ అంటూ ట్వీట్‌..

|

Jan 24, 2021 | 8:17 PM

Niharika Tweet About Master Movie: మెగా ఫ్యామీలో నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి నిహారిక. వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో నటించి నటన విషయంలో మంచి మార్కులే కొట్టేసిన నిహారిక..

Niharika: మాస్టర్పై పొగడ్తల వర్షం కురిపించిన మెగా డాటర్‌.. విజయ్‌ సార్‌ నా ఫేవరేట్‌ అంటూ ట్వీట్‌..
Follow us on

Niharika Tweet About Master Movie: మెగా ఫ్యామీలో నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి నిహారిక. వెబ్‌ సిరీస్‌లు, సినిమాల్లో నటించి నటన విషయంలో మంచి మార్కులే కొట్టేసిన నిహారిక కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ఇటీవల వివాహ బంధంతో నిహారిక సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోన్న నిహారిక తాజాగా ఓ సినిమా గురించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘మాస్టర్’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. ఓవైపు ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా.. మరోవైపు కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాపై నిహారిక ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. నిహారిక తన ట్విట్‌లో మాస్టర్‌ చిత్రంపై.. ‘సుమారు ఏడాది తర్వాత నేను థియేటర్‌లో చూసిన సినిమా ‘మాస్టర్‌’. ఈ సినిమా ఒక చక్కని విందులా ఉంది. దళపతి విజయ్‌ అద్భుతమైన నటుడు. అలాగే నాకెంతో ఇష్టమైన విజయ్‌ సేతుపతి సార్‌ని ఇలా చూడడం చాలా గొప్పగా అనిపించింది. లోకేష్‌ కనగరాజ్‌ గారు రూపొందించిన ‘ఖైదీ’ చిత్రం నాకెంతో నచ్చింది. అలాగే ‘మాస్టర్‌’ కూడా చక్కని మెసేజ్‌తో అందరినీ అలరించేలా ఉంది’ అంటూ నిహారిక మాస్టర్‌ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.

మాస్టర్‌ సినిమాను పొగుడుతూ నిహారిక చేసిన ట్వీట్…

Also Read: Nag Ashwin Prabhas Movie: ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త.. నాగ్‌ అశ్విన్‌ సినిమా నుంచి రెండు కొత్త అప్‌డేట్‌లు రానున్నాయి..