ఈనెల 20 నుంచి.. జాతీయ రహదారులపై.. టోల్ వసూల్..

| Edited By:

Apr 18, 2020 | 12:34 PM

కరోనా కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. దేశవ్యాప్తంగా ఈనెల 20 నుంచి జాతీయ రహదారులపై టోల్‌ రుసుములను వసూలు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)

ఈనెల 20 నుంచి.. జాతీయ రహదారులపై.. టోల్ వసూల్..
Follow us on

కరోనా కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. అయితే.. దేశవ్యాప్తంగా ఈనెల 20 నుంచి జాతీయ రహదారులపై టోల్‌ రుసుములను వసూలు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది. దీనిపై రవాణా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అత్యవసర సేవలపై భారాన్ని తగ్గించడం కోసం టోల్‌ వసూలును నిలిపివేయాలని మార్చి 25న కేంద్రం ప్రకటించింది. ”అంతర్‌రాష్ట్ర, రాష్ట్రాల పరిధిలో ట్రక్కులు, ఇతర సరకు రవాణా వాహనాలు తిరగడానికి వీలుగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన సడలింపులను అమలు చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకోవాలి.

కాగా.. ఏప్రిల్‌ 20 నుంచి టోల్‌ వసూలును మొదలుపెట్టాలి” అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ.. ఎన్‌హెచ్‌ఏఐకి లేఖరాసింది. దీనిపై అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) అభ్యంతరం తెలిపింది. ”నిత్యావసర వస్తువుల రవాణా కొనసాగాలన్న ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అనేక ఇబ్బందులను తట్టుకొని ట్రక్కుల యజమానులు పనిచేస్తున్నారు. కోవిద్-19 మహమ్మారి విజృంభణతో రవాణా రంగం ప్రస్తుతం కుదేలైంది. డ్రైవర్లను పనిలోకి రప్పించడానికి కూడా డబ్బులేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రంగాన్ని ఆదుకోవాలి” అని పేర్కొంది.