రాయలసీమ ఎత్తిపోతపై ఏపీకి ఎన్జీటీ కీలక ఆదేశాలు

|

Oct 29, 2020 | 1:58 PM

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

రాయలసీమ ఎత్తిపోతపై ఏపీకి ఎన్జీటీ కీలక ఆదేశాలు
Follow us on

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని ఆంధ్రప్రదేశ్‌కు ఆదేశాలిచ్చింది. ప్రాజెక్టు పూర్తి డీపీఆర్ సమర్పించి పర్యావరణ పర్మిషన్స్ తీసుకోవాలని సూచించింది. తాగునీటితోపాటు సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని ఎన్జీటీ అభిప్రాయపడింది. ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని కేంద్ర జలశక్తి రాసిన లేఖ విషయాన్ని ఎన్జీటీ గుర్తుచేసింది.

మరోవైపు  రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా అదనంగా నీటి వినియోగించటం లేదు కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం లేదని  గతంలో ఎన్జీటీ న్యాయ‌మూర్తికి ఏపీ ప్రభుత్వ లాయర్ తెలిపారు. పంపింగ్, చిన్నపాటి రిపేర్లు చేయడం ప్రాజెక్టు లో మార్పు కాదన్నారు. అయినా కూడా అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది.

Also Read :

హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ… కేసు నమోదు

ప్రియుడిని పరిచయం చేసిన పూనమ్ బజ్వా