బోటు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్…. రంగంలోకి కాకినాడ బ్యాచ్… !!

|

Sep 25, 2019 | 9:35 PM

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు  గోదావరిలో మునిగిపోయిన లాంచీ విషయంలో కొత్త ట్విస్ట్. కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కాకినాడకు చెందిన శ్రీనివాస్ బృందం కలిసింది. కలెక్టర్ సూచన మేరకు కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటు ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో నుంచి బోటును బయటికి తీసేందుకు అవసరమైన సామాగ్రి, పరికరాలు తమ వద్ద ఉన్నాయంటూ  శ్రీనివాస్ బృందం కలెక్టర్‌కు తెలిపింది. గతంలో సముద్రంలో మునిగిపోయిన షిప్పులను వెలికి తీసిన అనుభవం ఉందంటున్న శ్రీనివాస్..అందుకు సంబంధించిన […]

బోటు మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.... రంగంలోకి కాకినాడ బ్యాచ్... !!
Follow us on

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు  గోదావరిలో మునిగిపోయిన లాంచీ విషయంలో కొత్త ట్విస్ట్. కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటును వెలికి తీస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ను కాకినాడకు చెందిన శ్రీనివాస్ బృందం కలిసింది. కలెక్టర్ సూచన మేరకు కచ్చులూరులో ప్రమాదానికి గురైన బోటు ప్రదేశాన్ని పరిశీలించారు. నదిలో నుంచి బోటును బయటికి తీసేందుకు అవసరమైన సామాగ్రి, పరికరాలు తమ వద్ద ఉన్నాయంటూ  శ్రీనివాస్ బృందం కలెక్టర్‌కు తెలిపింది.

గతంలో సముద్రంలో మునిగిపోయిన షిప్పులను వెలికి తీసిన అనుభవం ఉందంటున్న శ్రీనివాస్..అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కలెక్టర్‌కు చూపించారు.  నాలుగు బోట్లు, ఒక జెసిబి సాయంతో  25 మంది బృందంగా ఏర్పడి బోటును వెలికి తీస్తామని వారు చెప్తున్నారు. గతంలో రెండు వేల టన్నుల బరువున్న షిప్పులనే బయటికి తీశామని…30 టన్నులు ఉండే బోటు కూడా కచ్చితంగా వెలికి తీస్తామని వారు పేర్కొన్నారు.  30 సంవత్సరాల నుంచి నీటిలో మునిగిపోయిన బోట్లను, పెద్ద పెద్ద షిప్పులను కూడా వెలికి తీశామని..  గత బోటు ప్రమాదాలకు సంబంధించిన ఉదాహారణలను వారు వివరిస్తన్నారు. మరి శ్రీనివాస్ అభ్యర్థనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కాగా తమ వారి ఆచూకి కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద బాధితుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. బోటు వెలికితీస్తారేమో.. అందులో తమవారి ఆచూకి లభిస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా కొందరు తమవాళ్ల ఆచూకి దొరక్కపోయినా..ఆశలు వదులుకోని కర్మకాండలు నిర్వహిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగి గల్లంతైన వారిలో మంచిర్యాలకు చెందిన యువ ఇంజనీర్ రమ్య కూడా ఉన్నారు. ఇంకా ఆమె ఆచూకీ తెలియరాలేదు. వస్తుందన్న ఆశలు కూడా సన్నగిల్లడంతో రమ్యశ్రీ తండ్రి తన కూతురికి శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. పది రోజులు దాటినా కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి రాజమండ్రిలోని కోటి లింగాల ఘాట్‌ వద్ద కర్మకాండలు పూర్తి చేశారు.