New  Strain Coronavirus :యూకే వైరస్‌లో మరో కొత్త స్ట్రెయిన్,, ఇండియాలో 38కి పెరిగిన కేసుల సంఖ్య, ప్రభుత్వం అప్రమత్తం..

| Edited By: Pardhasaradhi Peri

Jan 04, 2021 | 5:47 PM

బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ జాడ కనిపించింది. కోవిడ్ 19 నుంచి వచ్చిందే అయినా దీన్ని న్యూ టైప్ వైరస్ గా పరిగణిస్తున్నారు. ఇండియాలో ఇప్పటివరకు..

New  Strain Coronavirus :యూకే వైరస్‌లో మరో కొత్త స్ట్రెయిన్,, ఇండియాలో 38కి పెరిగిన కేసుల సంఖ్య, ప్రభుత్వం అప్రమత్తం..
Follow us on

Strain Virus:బ్రిటన్ లో కొత్త స్ట్రెయిన్ కరోనా వైరస్ జాడ కనిపించింది. కోవిడ్ 19 నుంచి వచ్చిందే అయినా దీన్ని న్యూ టైప్ వైరస్ గా పరిగణిస్తున్నారు. ఇండియాలో ఇప్పటివరకు ఈ కేసుల సంఖ్య 38 కి పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో బెంగుళూరులో 10, హైదరాబాద్ లో 3, పూణేలో 5, ఢిల్లీలో మొత్తం 19, కోల్ కతా లో 1 నమోదైనట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యక్తులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశిత కోవిడ్ కేంద్రాల్లోని సింగిల్ రూమ్ ఐసోలేషన్ లో ఉంచి వీరి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నాయి. అలాగే వీరితో కాంటాక్ట్ లో ఉన్నవారిని కూడా ట్రాక్ చేయడానికి యత్నిస్తున్నాయి. అయితే ఇది యూకే మ్యుటెంట్ వైరస్ మాత్రం కాదని ఆరోగ్య శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.

కాగా ఈ కేసుల వివరాలను ఈ వర్గాలు వివరిస్తూ హైదరాబాద్ లోని సీసీఎంబీలో మూడు, బెంగుళూరులోని నిమ్హాన్స్ లో 10, పూణేలోని ఎన్ ఐ వీలో 5, ఢిల్లీ ఐజీబీఐలో 11, అదే నగరంలోని ఎన్ సీ డీ సీ లో   8 కేసులు నమోదైనట్టు తెలిపాయి. యూకే నుంచి తిరిగి వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వివిధ టెస్టులు నిర్వహిస్తున్నారు.

Also Read:

Hitler 24 Years: ‘హిట్లర్’ వచ్చి నేటితో 24 ఏండ్లు.. 100 డేస్ ఫంక్షన్‌ గురించి ఒక విషయం చెబుతున్న ‘లూసిఫర్’ డైరెక్టర్

నాగర్‌కర్నూలు జిల్లాలో అలస్యంగా వెలుగుచూసిన దారుణం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై మైనర్ బాలుర సామూహిక అత్యాచారం

మరో రెండు నెలల తరువాతే అందుబాటులోకి సీరం వ్యాక్సిన్, ప్రైవేట్ ఆసుపత్రులు, కంపెనీలకు లభ్యం