Breaking News : సింహాల మాయంలో మరో ట్విస్ట్..

|

Sep 19, 2020 | 1:34 PM

వెండి రథం సింహాల మాయంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ జరిగనట్టు గుర్తించారు పోలీసులు. ఉగాది ఉత్సవాల సందర్భంగా రథాన్ని సిద్ధం చేయాలంటూ ఈవో సురేష్‌ బాబు మార్చి..

Breaking News : సింహాల మాయంలో మరో ట్విస్ట్..
Follow us on

వెండి రథం సింహాల మాయంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ జరిగనట్టు గుర్తించారు పోలీసులు. ఉగాది ఉత్సవాల సందర్భంగా రథాన్ని సిద్ధం చేయాలంటూ ఈవో సురేష్‌ బాబు మార్చి 11న సర్కిలర్‌(RC.NO.F1/358 సర్కిలర్) జారీ చేశారు. రథంకు మరమ్మతులతోపాటు పాలిష్‌ చేయాలని ఇంజినీరింగ్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.

సర్కిలర్ లో స్పష్టంగా మార్చి 25న వెండి రథం ఊరేగింపు ప్రస్తావన కూడా ఉంది. మార్చి 25 సాయంత్రం 5 గంటలకి వెండి రథం ఊరేగింపు ఉంటుంది కాబట్టి రథం మరమ్మత్తులు, పాలిష్ చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారు రథంకు పాలిష్ పెట్టారు. మెరుపులు అద్దారు. అయితే ఆ సమయంలో రథంలో నాలుగు సింహాలు ఉన్నట్లుగా పోలీసులకు తెలిపారు. మరిన్ని వివరాలను ఇంజినీరింగ్ విభాగం, స్తపతి, పాలిష్ పెట్టె వారు, అప్రిజర్ నుంచి వివరాలను సేకరిస్తున్నారు.