రాత్రి 8 గంటలు దాటితే క్లోజ్…రేపటినుంచే అమల్లోకి..

| Edited By:

Oct 01, 2019 | 1:16 PM

మద్యం ఇక గగనమే.. ఇప్పటివరకు ఏరులై పారిన మద్యం అమ్మకాలకు ఏపీ ప్రభుత్వం సడెన్ బ్రేక్ వేసింది. మంగళవారం నుంచి కొత్త మద్యం పాలసీ రానుండటంతో సోమవారం సాయంత్రం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరి కనిపించారు. తెల్లవారితే కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుండటంతో ఆయా దుకాణదారులు తమ వద్ద నున్న పాత స్టాకును తక్కువ ధరకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న సరుకును ఏదో ఒక విధంగా మద్యం ప్రియులకు అంటగట్టాలనే ఉద్దేశంతో […]

రాత్రి 8 గంటలు దాటితే క్లోజ్...రేపటినుంచే అమల్లోకి..
Follow us on

మద్యం ఇక గగనమే.. ఇప్పటివరకు ఏరులై పారిన మద్యం అమ్మకాలకు ఏపీ ప్రభుత్వం సడెన్ బ్రేక్ వేసింది. మంగళవారం నుంచి కొత్త మద్యం పాలసీ రానుండటంతో సోమవారం సాయంత్రం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరి కనిపించారు. తెల్లవారితే కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుండటంతో ఆయా దుకాణదారులు తమ వద్ద నున్న పాత స్టాకును తక్కువ ధరకే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న సరుకును ఏదో ఒక విధంగా మద్యం ప్రియులకు అంటగట్టాలనే ఉద్దేశంతో సోమవారం అతి తక్కువ ధరకే మద్యాన్ని విక్రయించారు. దీంతో మద్యం ప్రియులు ఆయన వైన్ షాపుల ముందు బారులు తీరి కనిపించారు.

రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గత ప్రభుత్వ హాయంలో మద్యం ఆదాయ వనరుగా ఉన్నప్పటికి, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మద్యం ద్వారా వచ్చే ఆదాయం తమకు అవసరంలేదని చెబుతోంది. మద్యం మత్తులో జరగుతున్న ఎన్నో దారుణాలు, నేరాలను అరికట్టడం కోసం నిషేదాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలకు, ఘోరాలకు ప్రధాన కారణం మద్యపానమే అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ మద్యపాన నిషేదంపై హామీ ఇచ్చింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత సీఎం జగన్ మద్యపాన నిషేదాన్ని పటిష్టంగా అమలు జరిగేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నారు. దీన్ని దశలవారీగా అమలు చేసేలా ఇప్పటికే ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నారు. ముందుగా గ్రామాలు, పట్టణాల్లో ఇబ్బడిముబ్బడిగా ఉన్న బెల్ట్ షాపులను రద్దు చేశారు. అదే విధంగా నూతన మద్యం విధానాన్ని తీసుకువచ్చి ఇకపై ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 11నుంచి రాత్రి 8 గంటలకే మద్యం షాపులు క్లోజ్ చేస్తారు. బీర్లు, లిక్కర్ అమ్మకాలు పరిమితంగానే అమ్మకాలు చేయనున్నారు. ఒక మనిషికి గరిష్టంగా మూడు సీసాల మద్యం మాత్రమే లభించేలా కొత్త పాలసీని తీర్చిదిద్దారు. అంతకంటే ఎక్కువ మద్యం సీసాలు లభిస్తే చర్యలు తీసుకుంటారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగున్న ఒక్కో దుకాణంలో ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. ఏపీలో మొత్తం 4,380 మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినా.. బెల్ట్ షాపులను ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరించనున్నారు.