త్వరలో ఏపీలో జిల్లాల విభజన..జగన్ అభిమతం ఏంటంటే ?

| Edited By: Srinu

Nov 07, 2019 | 1:24 PM

ఏపీలో ఒకవైపు రాజధాని రగడ కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్రాన్ని కుదిపేసే ఇంకో అంశం తెరమీదికి వచ్చింది. అయితే.. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఓ కీలకమైన హామీపై ఆయన ప్రస్తుతం ఏమీ మాట్లాడకపోవడం పార్టీ వర్గాల్లో టెన్షన్‌కు కారణమవుతోంది. అదే రాష్ట్రంలోని 13 జిల్లాలను విడగొట్టి 25, 26గానే చేయడం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. కానీ తాజా ఆయన అభిమతమేంటో అర్థం కాక పార్టీ వర్గాలు బుర్రబద్దలు కొట్టుకుంటున్నాయి. […]

త్వరలో ఏపీలో జిల్లాల విభజన..జగన్ అభిమతం ఏంటంటే ?
Follow us on
ఏపీలో ఒకవైపు రాజధాని రగడ కొనసాగుతుండగానే మరోవైపు రాష్ట్రాన్ని కుదిపేసే ఇంకో అంశం తెరమీదికి వచ్చింది. అయితే.. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన ఓ కీలకమైన హామీపై ఆయన ప్రస్తుతం ఏమీ మాట్లాడకపోవడం పార్టీ వర్గాల్లో టెన్షన్‌కు కారణమవుతోంది. అదే రాష్ట్రంలోని 13 జిల్లాలను విడగొట్టి 25, 26గానే చేయడం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. కానీ తాజా ఆయన అభిమతమేంటో అర్థం కాక పార్టీ వర్గాలు బుర్రబద్దలు కొట్టుకుంటున్నాయి.
13,26 అయ్యేదెప్పుడు..తమ కల నెరవేరెదెప్పడు. ఏపీలో లోకల్‌గా విన్పిస్తున్న మాట. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆరునెలల్లో జిల్లాల విభజనపై డెసిషన్‌ వస్తుంది అనుకున్నారు. కానీ ఆ నిర్ణయం మాత్రం రావడం లేదు. అసలు జగన్ అంతరంగమేంటో కూడా తెలియడం లేదు.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా ఒక్కో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడి, గ్రామ సచివాలయాలతో పాటు పలు పథకాలను లైన్‌లోకి తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం పనులను పట్టాలెక్కించారు.
అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో 13 జిల్లాలను విభజిస్తామని జగన్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు.
13 జిల్లాలను విభజిస్తామని సీఎం జగన్‌ అప్ప్టట్లోనే చెప్పారు. పార్లమెంట్‌ నియోజవకర్గం ఓ యూనిట్‌గా జిల్లా విభజన ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రకారం ఏపీలో 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలు ఉన్నాయి, దీంతో 25 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం నడిచింది. కొన్ని భౌగోళిక పరిస్థితులు, ఇతర అంశాలు గమనించిన వారు…26 జిల్లాలు ఏర్పడుతాయని కూడా అంటున్నారు. మొత్తానికి ఏపీలో 26 జిల్లాలు ఏర్పడుతాయనేది సచివాలయంలో విన్పిస్తున్న గుసగుస. అయితే ఎప్పుడు జిల్లాల విభజన ఎప్పుడు జరుగుతుంది అనేది? ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ జిల్లాల విభజనపై ఓ క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జిల్లాల విభజన జరుగుతుందనే సంకేతాలు పంపారు. ఫిబ్రవరిలో లోకల్‌ బాడీ ఎలక్షన్స్‌ జరిగే అవకాశం ఉంది. మార్చి నెలలో కూడా కొనసాగే చాన్స్‌ కనిపిస్తోంది. దీంతో వచ్చే ఏప్రిల్‌ తర్వాత జిల్లాల విభజనపై ఓ అడుగు ముందుకు పడే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.