ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ..!

| Edited By:

May 22, 2020 | 10:41 AM

ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ముద్రించి ఇస్తున్నారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని ఇస్తుండగా.. కార్డు ముందు భాగంలో కార్డు దారుని ఫోటోను ముద్రించారు.

ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ..!
Follow us on

Aarogyasri: ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులను కొత్తగా ముద్రించి ఇస్తున్నారు. డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా వీటిని ఇస్తుండగా.. కార్డు ముందు భాగంలో కార్డు దారుని ఫోటోను ముద్రించారు. వెనకపక్కన మిగిలిన కుటుంబ సభ్యుల వివరాలతో పాటు.. కార్డు ఉద్దేశం, వైద్య సాయం వివరాలను ముద్రించారు. కాగా.. ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుండటం తెలిసిందే.

మరోవైపు.. ఆధార్ తో అనుసంధానమైన తెలుపు రేషన్ కార్డు కలిగిన వారందరు ఈ పథకానికి అర్హులు. ఆరోగ్యశ్రీ పథకం అత్యున్నత ఆరోగ్య బీమా పథంకంగా గుర్తింపు పొందింది. దాదాపు 1038 పైగా జబ్బులకు ఈ పథకం కింద ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. ఈ పథకం కింద అర్హులైన పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలందించడంతో పాటు రవాణా, భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తారు.