‘యతి’ మా ఊరొచ్చింది.. ఫుట్‌ప్రింట్స్ చూస్తారా.. ఇవిగో

| Edited By:

May 03, 2019 | 5:09 PM

హిమాలయ పర్వతారోహణకు వెళ్లిన తమకు పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయని.. అవి ‘యతి’వని భావిస్తున్నామంటూ ఇటీవల భారత ఆర్మీకి చెందిన కొందరు జవాన్లు ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అయితే వాటిని నేపాల్ ఆర్మీ అధికారులు ఖండిస్తూ.. అవొక ఎలుగుబంటివని స్పష్టం. దీంతో యతి ఎపిసోడ్ అక్కడితో ఆగిపోయింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఫొటోలను సైటైరిక్‌గా వాడుకుంటున్నారు. సిటీల్లోని రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద గుంతల ఫొటోలను తీసి.. ‘‘యతి మా ప్రాంతానికి వచ్చింది. […]

‘యతి’ మా ఊరొచ్చింది.. ఫుట్‌ప్రింట్స్ చూస్తారా.. ఇవిగో
Follow us on

హిమాలయ పర్వతారోహణకు వెళ్లిన తమకు పెద్ద పెద్ద పాదముద్రలు కనిపించాయని.. అవి ‘యతి’వని భావిస్తున్నామంటూ ఇటీవల భారత ఆర్మీకి చెందిన కొందరు జవాన్లు ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. అయితే వాటిని నేపాల్ ఆర్మీ అధికారులు ఖండిస్తూ.. అవొక ఎలుగుబంటివని స్పష్టం. దీంతో యతి ఎపిసోడ్ అక్కడితో ఆగిపోయింది. అయితే నెటిజన్లు మాత్రం ఆ ఫొటోలను సైటైరిక్‌గా వాడుకుంటున్నారు. సిటీల్లోని రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద గుంతల ఫొటోలను తీసి.. ‘‘యతి మా ప్రాంతానికి వచ్చింది. చూడండి దాని పాదపు గుర్తులు’’ అంటూ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌కు చెందిన కొందరు నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ చేశారు.