వెన‌క్కి త‌గ్గిన నేపాల్..స‌రిహ‌ద్దు వ‌ద్ద వాచ్​ టవర్ తొలగింపు

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 6:36 PM

మ‌న‌తో మిత్ర దేశంగా మెలిగిన‌ నేపాల్..ఇటీవ‌ల దూకుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌త భూభాగాలు అయిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలు త‌మ‌వే అంటూ నూత‌న మ్యాప్ రిలీజ్ చేసింది.

వెన‌క్కి త‌గ్గిన నేపాల్..స‌రిహ‌ద్దు వ‌ద్ద వాచ్​ టవర్ తొలగింపు
Follow us on

మ‌న‌తో మిత్ర దేశంగా మెలిగిన‌ నేపాల్..ఇటీవ‌ల దూకుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. భార‌త భూభాగాలు అయిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలు త‌మ‌వే అంటూ నూత‌న మ్యాప్ రిలీజ్ చేసింది. అంతేకాదు ఇటీవ‌ల బార్డ‌ర్ స‌మీపంలో మిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసి..వరుసగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది. అయితే ఈ విష‌యంపై నేపాల్ తాజాగా వెనక్కి తగ్గింది. బిహార్​లోని పంతోక గ్రామంలో ఏర్పాటు చేసిన‌ క్యాంప్ సహా వాచ్​ టవర్​ను తొలగించింది. నేపాల్ ద‌ళాల‌తో..భార‌త్ సశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) జరిపిన చర్చల అనంతంరం నేపాల్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. కాగా చైనా ఆదేశాలతోనే సరిహద్దులో నిఘా పెంచడానికి ఈ నిర్మాణం చేపట్టినట్లు భార‌త్ భావించిన విష‌యం తెలిసిందే.

ఇక అంతకుముందు ఇండియా భూభాగంలోకి చొరబడిన నేపాలీ సైనికులు సైతం… సైనిక, దౌత్యపరమైన చర్యల తర్వాత వెనక్కి తగ్గారు. బార్డ‌ర్ వెంబడి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ద‌ళాల‌ను ఉపసంహరించుకుంది నేపాల్.