నీట్ 2019 ఫలితాలు విడుదల

| Edited By:

Jun 05, 2019 | 4:37 PM

నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ జాతీయ ర్యాంకులు ప్రకటించింది ఎన్‌టీఏ. దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను మే 5న 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది దరఖాస్తు చేసుకోగా, 7,97,042 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీలో 72.55 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 30,039 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణలో 68.68 శాతం ఉత్తీర్ణత నమోదు […]

నీట్ 2019 ఫలితాలు విడుదల
Follow us on

నీట్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ జాతీయ ర్యాంకులు ప్రకటించింది ఎన్‌టీఏ. దేశవ్యాప్తంగా వైద్య కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను మే 5న 154 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది దరఖాస్తు చేసుకోగా, 7,97,042 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీలో 72.55 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 30,039 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణలో 68.68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖండేల్ వాల్‌ 701 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించగా, టాప్‌ 50లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 4 ర్యాంకులు సాధించారు. తెలంగాణ విద్యార్థిని జి మాధురిరెడ్డికి 695 మార్కులతో ఏడో ర్యాంక్ సాధించింది. ఏపీ విద్యార్థి ఖురేషి అస్రా 690 మార్కులతో 16వ ర్యాంక్, పిల్లి భాను శివతేజకు 40వ ర్యాంక్, ఎస్ శ్రీనందన్ రెడ్డికి 42వ ర్యాంకులు సాధించారు.