క‌రోనా కోర‌ల్లో ర‌ష్యా.. ఒకే రోజు 8 వేల కొత్త కేసులు..

| Edited By:

May 01, 2020 | 7:42 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు ర‌ష్యాలో కూడా కోరలు చాస్తోంది. శుక్ర‌వారం ఒకే రోజు ర‌ష్యాలో రికార్డుస్థాయిలో దాదాపు

క‌రోనా కోర‌ల్లో ర‌ష్యా.. ఒకే రోజు 8 వేల కొత్త కేసులు..
Follow us on

Coronavirus In Russia: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్‌.. అటు ర‌ష్యాలో కూడా కోరలు చాస్తోంది. శుక్ర‌వారం ఒకే రోజు ర‌ష్యాలో రికార్డుస్థాయిలో దాదాపు 8వేల కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్పటివ‌ర‌కు 1,14,431 మంది ఈ వైర‌స్ బారిన ప‌డ్డ‌ట్టు ఆ దేశ క‌రోనావైర‌స్ క్రిసిస్ రెస్పాన్స్ సెంట‌ర్ తెలిపింది.

కాగా.. గత 24 గంట‌ల్లో 96 మంది మ‌ర‌ణించారు. దాంతో మొత్తం మృ‌తుల సంఖ్య 1,169కి చేరింది. ర‌ష్యా ప్ర‌ధాని మైఖేల్ మిషుస్తిన్‌(54) సైతం క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. గురువారం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో తాను సెల్ఫ్ ఐసోలేష‌న్‌కి వెళ్తున్న‌ట్టు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు మిషుస్తిన్ తెలియ‌జేశారు. కొవిడ్‌-19 సోకిన ఆయ‌న బ‌దులు తాత్కాలిక ప్ర‌ధానిగా ఉప ప్ర‌ధాని అంద్రెయ్ బెలోసోవ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.