కత్తి లాంటి జర్నలిజం వృత్తి.. ప్రాణాలకు లేదు గ్యారెంటీ!

| Edited By:

Dec 18, 2019 | 2:30 PM

ప్రపంచంలోనే ‘జర్నలిస్ట్’ ఉద్యోగం చాలా ప్రమాదకరమైనదని రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ వృత్తిలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని తాజా పరిశోధనలో వెల్లడించింది. తాజాగా.. సదరు అన్ని ఉద్యోగాలపై పరిశోధనలు నిర్వహించింది ఈ సంస్థ. ఈ పరిశోధనలో పలు ఆసక్తికరమైన నిజాలు వెల్లడైనట్టు రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ సభ్యులు పేర్కొన్నారు. కాగా అలాగే.. 57 మంది జర్నలిస్టులు బందీలుగా ఉన్నారని.. 389 మంది జైళ్లల్లో మగ్గుతున్నారని ఈ సంస్థ తెలిపింది. పారిస్‌లోని […]

కత్తి లాంటి జర్నలిజం వృత్తి.. ప్రాణాలకు లేదు గ్యారెంటీ!
Follow us on

ప్రపంచంలోనే ‘జర్నలిస్ట్’ ఉద్యోగం చాలా ప్రమాదకరమైనదని రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ ఆఫ్ ఇండియా సంస్థ పేర్కొంది. ఈ వృత్తిలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని తాజా పరిశోధనలో వెల్లడించింది. తాజాగా.. సదరు అన్ని ఉద్యోగాలపై పరిశోధనలు నిర్వహించింది ఈ సంస్థ. ఈ పరిశోధనలో పలు ఆసక్తికరమైన నిజాలు వెల్లడైనట్టు రిపోర్టర్స్ విత్‌ఔట్ బోర్డర్స్ సభ్యులు పేర్కొన్నారు. కాగా అలాగే.. 57 మంది జర్నలిస్టులు బందీలుగా ఉన్నారని.. 389 మంది జైళ్లల్లో మగ్గుతున్నారని ఈ సంస్థ తెలిపింది. పారిస్‌లోని ఈ సంస్థ గత రెండు దశాబ్దాల్లో సగటున 80 మంది జర్నలిస్టులు మృత్యువాత పడినట్టు తన అధ్యయనంలో పేర్కొంది.

దాదాపు పదేళ్లలో.. 941 మంది జర్నలిస్టులు మరణించినట్లు వారు రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే.. ప్రస్తుత సంవత్సరం 2019లో ప్రపంచ వ్యాప్తంగా.. ఏకంగా 49 మంది పాత్రికేయులు హత్యకు గురైనట్లు, మరికొంత మంది పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టర్స్ విత్‌‌ఔట్ బోర్డర్స్ సంస్థ వెల్లడించింది. అతి ప్రమాదకరమైన వృత్తుల్లో పాత్రికేయుల వృత్తి ఒకటని.. ఏటా సగటున పలువురు జర్నలిస్టులు వార్తల సేకరణలో చనిపోతున్నట్లు పేర్కొంది.

ముఖ్యంగా సిరియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్గనిస్తాన్, యెమెన్‌లో జరుగుతోన్న విధ్వంసకర పరిస్థితులపై వార్తలను సేకరించేందుకు వెళ్తున్న జర్నలిస్టుల్లో.. చాలా మంది తిరిగి రావడం లేదంటూ రిపోర్టర్స్ విత్‌ఔట్ సంస్థ తెలిపింది. కాగా.. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 63 శాతం జర్నలిస్టులు హత్య చేయబడ్డారని రిపోర్టులో పేర్కొన్నారు. అలాగే.. పలు వార్తలను సేకరించే సందర్భాల్లో కూడా వారు బెదిరింపులకు, అవమానాలకు, ప్రమాదాలకు గురవుతున్నట్లు వివరించారు.