ఆ ఫ్యాక్టరీలోని 300 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..!

| Edited By:

Aug 15, 2020 | 10:13 AM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూకేలోని శాండ్‌విచ్ ఫ్యాక్టరీలో పనిచేసే 299 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఒకే ఫ్యాక్టరీలో ఇంతమందికి పాజిటివ్

ఆ ఫ్యాక్టరీలోని 300 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్..!
Follow us on

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూకేలోని శాండ్‌విచ్ ఫ్యాక్టరీలో పనిచేసే 299 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఒకే ఫ్యాక్టరీలో ఇంతమందికి పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ఫ్యాక్టరీ నార్తాంప్టన్ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అధికారులు శాండ్‌విచ్ ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయడం ప్రారంభించారు. 299 మందికి పాజిటివ్ అని తేలగా.. ఇంకా చాలా మంది ఉద్యోగుల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది.

మార్క్స్ & స్పెన్సర్‌కు ప్రీ-ప్యాకేజ్డ్ శాండ్‌విచ్‌లను సరఫరా చేసే గ్రీన్‌కోర్ కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులకు కరోనా రావడంతో వారిని వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్‌కు పంపామని సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, అధికారులు ఎప్పటికప్పుడు తమకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ ప్రకటనలో సంస్థ యాజమాన్యం చెప్పుకొచ్చింది. నార్తాంప్టన్ ప్రాంతంలో గత నాలుగు వారాల నుంచి కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. కాగా.. యూకేలో ఇప్పటివరకు 313,798 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 41,358 మంది మృతిచెందారు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!