మనీ లాండరింగ్‌ కేసు నేపథ్యంలో… ఎమ్మెల్యే పదవికి అజిత్ పవార్ రాజీనామా!

| Edited By:

Sep 27, 2019 | 9:46 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ కీలక నేత, శరద్ పవార్ మేనల్లుడు బారామతి ఎమ్మెల్యే అజిత్ పవార్ తన ఎమ్మెల్యే పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ హరిభావు బగాడే కూడా ధృవీకరించారు. ‘‘అజిత్ పవార్ రాజీనామా నాకు అందింది. రాజీనామా ఎందుకు చేస్తున్నారో సరైన కారణం తెలపలేదు. అయినా సరే, ఆయన అభ్యర్థనను మన్నించి రాజీనామాను ఆమోదించాను’’ అని స్పీకర్ […]

మనీ లాండరింగ్‌ కేసు నేపథ్యంలో... ఎమ్మెల్యే పదవికి అజిత్ పవార్ రాజీనామా!
Follow us on

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ కీలక నేత, శరద్ పవార్ మేనల్లుడు బారామతి ఎమ్మెల్యే అజిత్ పవార్ తన ఎమ్మెల్యే పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ హరిభావు బగాడే కూడా ధృవీకరించారు. ‘‘అజిత్ పవార్ రాజీనామా నాకు అందింది. రాజీనామా ఎందుకు చేస్తున్నారో సరైన కారణం తెలపలేదు. అయినా సరే, ఆయన అభ్యర్థనను మన్నించి రాజీనామాను ఆమోదించాను’’ అని స్పీకర్ ప్రకటించారు.

రూ.25,000 కోట్ల విలువైన మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన కేసులో పవార్‌తో పాటు ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద పవార్‌ ద్వయంతో పాటు ఇతరులపై కూడా ఈసీఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే.