ఏపీకి మూడు జాతీయ అవార్డులు

|

Oct 02, 2020 | 6:34 PM

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరో అవార్డు దక్కింది. గాంధీ జ‌యంతి, స్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ సంద‌ర్భంగా కేంద్రం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో...

ఏపీకి మూడు జాతీయ అవార్డులు
Follow us on

జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు మరో అవార్డు దక్కింది. గాంధీ జ‌యంతి, స్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ సంద‌ర్భంగా కేంద్రం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్‌ సముదాయక్‌ శౌచాలయ కేటగిరీలో రెండో ర్యాంకు, సముదాయక్‌ శౌచాలయ అభియాన్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌, దీంతో పాటు గంధగి ముక్త్‌ భారత్‌ కేటగిరీలో మూడవ ర్యాంక్‌ లభించింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి సత్ఫలితాలనిచ్చిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.  గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఇన్ని ర్యాంకులు దక్కలేదని అభిప్రాయ పడ్డారు. ఇదిలావుంటే.. 2014 నుంచి ప్రతిఏటా అక్టోబర్‌ 2న గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛ భారత్‌ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలను స్వచ్ఛ భారత్‌ దివస్‌ కింద ర్యాంకులను ప్రకటించ అవార్డులను అందజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వర్చువల్ పద్దతిలో అవార్డులను అందించారు.