సాహో ‘ఇస్రో’: ‘నాసా’ ప్రశంసలు

| Edited By:

Jul 23, 2019 | 12:44 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి ఈ ప్రయోగం వాయిదా పడిన సమయంలో కొందరు భారత్‌పై తమ అక్కసును బయటపెట్టగా.. ఇప్పుడు ప్రయోగం విజయవంతమవడం వారిని నోళ్లను మూయించినట్లైంది. కాగా ఇస్రో చేసిన ఈ ప్రయోగంపై నాసా అద్భుతం అంటూ తమ అభినందనలను తెలిపింది. ‘‘చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు కంగ్రాట్స్. మీ ప్రతిష్టాత్మక మిషన్‌కు […]

సాహో ‘ఇస్రో’: ‘నాసా’ ప్రశంసలు
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి ఈ ప్రయోగం వాయిదా పడిన సమయంలో కొందరు భారత్‌పై తమ అక్కసును బయటపెట్టగా.. ఇప్పుడు ప్రయోగం విజయవంతమవడం వారిని నోళ్లను మూయించినట్లైంది. కాగా ఇస్రో చేసిన ఈ ప్రయోగంపై నాసా అద్భుతం అంటూ తమ అభినందనలను తెలిపింది.

‘‘చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు కంగ్రాట్స్. మీ ప్రతిష్టాత్మక మిషన్‌కు డీప్ స్పేష్ సెంటర్‌ నుంచి మా సహాయం కూడా అందించినందుకు గర్వపడుతున్నాం. మరికొన్ని సంవత్సరాల్లో చంద్రుడి దక్షిణ ధృవం సమీపానికి మా వ్యోమగాములను పంపేందుకు మీ మిషన్ నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది నాసా సంస్థ.

అయితే ఇస్రో దాదాపు వెయ్యికోట్లను చంద్రయాన్ 2 కోసం వెచ్చించింది. 3,877కిలోల బరువు గల చంద్రయాన్ 2ను జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం1 వాహకనౌక ద్వారా ప్రయోగించారు. సుమారు 50రోజుల తరువాత ఇది చంద్రుడి కక్షలోకి ప్రవేశించనుంది. చంద్రుడిపై దిగిన వెంటనే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు రానుండగా.. ఆ తరువాత 14రోజుల పాటు ఆ రోవర్ చంద్రుడిపై పరిశోధనలు జరపనుంది.