మోదీ 2.O: కొత్త కేబినెట్‌లో ఉండబోయేది వీరేనా..?

| Edited By:

May 30, 2019 | 3:30 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ తన మిత్రాపక్షాలతో కలిసి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మోదీ రెండోసారి ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు పలువురు తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. వీరిలో మోదీ మొదటిసారి పనిచేసినప్పుడు ఉన్న వారితో పాటు కొత్త వారికి చోటు ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సదానందగౌడ, అర్జున్‌రామ్ మేఘవాల్, ప్రకాశ్ జవదేకర్, రాందాస్ […]

మోదీ 2.O: కొత్త కేబినెట్‌లో ఉండబోయేది వీరేనా..?
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన బీజేపీ తన మిత్రాపక్షాలతో కలిసి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మోదీ రెండోసారి ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు పలువురు తమ బాధ్యతలను స్వీకరించనున్నారు. వీరిలో మోదీ మొదటిసారి పనిచేసినప్పుడు ఉన్న వారితో పాటు కొత్త వారికి చోటు ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం కొత్త మంత్రివర్గంలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సదానందగౌడ, అర్జున్‌రామ్ మేఘవాల్, ప్రకాశ్ జవదేకర్, రాందాస్ అథవాలే, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, బాబుల్ సుప్రీయో, సురేష్ అంగాడి, జితేంద్ర సింగ్, పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ప్రహ్లాద్ పటేల్, రవీంద్ర నాథ్, పురుషోత్తం రూపాలా, మన్సుక్ మాండ్వా, ఇంద్రజీత్ సింగ్, కిషన్ పాల్ గుజ్జర్, అనుప్రియ పటేల్, కిరణ్ రిజిజు, కైలాష్ చౌదరి, సంజీవ్ బలియాన్, ఆర్సీపీ సింగ్, నిత్యానంద్ రాయ్, థావర్ చంద్ గెహ్లాట్, దేబా శీష్ చౌదరి, రమేశ్ ఫోఖ్రియాల్, మన్సూక్ వసావా, రామేశ్వర్ తెలీ, హరసిమ్రత్ కౌర్ బాదల్, సుష్మా స్వరాజ్, సోం ప్రకాశ్, సంతోష్ గాంగ్వర్, రాంవిలాస్ పాశ్వాన్, గజేంద్రసింగ్ షెకావత్, ధర్మేంద్రప్రదాన్, అర్జున్ ముండా, సాధ్వి నిరంజన్ జ్యోతి ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికి ఈ సాయంత్రం గం.4.30ల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ ఉండనుంది. అయితే వీరిలో ఎంతమంది ప్రమాణస్వీకారం చేస్తారన్నది తెలియాల్సి ఉంది.