రవిప్రకాశ్ కస్టడీపై ముగిసిన వాదనలు..రేపు తీర్పు ఇవ్వనున్న కోర్టు!

|

Oct 10, 2019 | 4:40 PM

టీవీ 9 బహిష్కృత  సీఈవో రవిప్రకాశ్‌ ను విచారించేందుకుగాను 10 రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ.. హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు నాంపల్లి కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. రూ.18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్‌ పై టీవీ 9 యాజమాన్యం బంజారాహిల్స్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా… […]

రవిప్రకాశ్ కస్టడీపై ముగిసిన వాదనలు..రేపు తీర్పు ఇవ్వనున్న కోర్టు!
Follow us on

టీవీ 9 బహిష్కృత  సీఈవో రవిప్రకాశ్‌ ను విచారించేందుకుగాను 10 రోజులు తమ కస్టడీకి అప్పగించాలంటూ.. హైదరాబాద్‌ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై కోర్టులో వాదనలు ముగిశాయి. రేపు నాంపల్లి కోర్ట్ తీర్పు ఇవ్వనుంది.

రూ.18 కోట్లను అక్రమంగా డ్రా చేశారంటూ రవిప్రకాశ్‌ పై టీవీ 9 యాజమాన్యం బంజారాహిల్స్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో.. ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా… 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను కోర్టు విధించింది. ప్రస్తుతం రవిప్రకాశ్‌ చంచల్‌ గూడ జైల్లో ఉన్నారు.