కాలిబూదైన మీ సేవా సెంటర్

|

Jun 11, 2020 | 8:45 PM

మిర్యాలగూడ పట్టణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మీసేవా కేంద్రం దగ్ధం.

కాలిబూదైన మీ సేవా సెంటర్
Follow us on

నల్లగొండ జిల్లాలో మీ సేవా సెంటర్ అగ్నికి బుగ్గిపాలైంది. పూర్తిగా ఫర్నీచర్ ఖాళీపోయి సుమారు లక్షకుపైగా ఆస్తినష్టం వాటిల్లునట్లు అంచనావేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మీసేవా కేంద్రం దగ్ధమైంది. పట్టణంలోని చర్చిరోడ్డులో మమత కమ్యూనికేషన్‌ అగ్ని ప్రమాదానికి గురైంది. పట్టణానికి చెందిన ధనావత్‌ మమత మీసేవా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. పూర్తిగా మూసి ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించి.. కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, వివిధ సామగ్రి కాలిబూడిదయ్యాయి. సుమారు లక్షకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు బాధితురాలి ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.