రోజాపై పొగ‌డ్త‌లు…ప్ర‌భుత్వంపై విమ‌ర్మ‌లు..మున్సిపల్ కమిషనర్‌ స‌స్పెండ్

|

Apr 10, 2020 | 10:35 PM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ స‌ర్కార్ మరో అధికారి మీద సస్పెన్షన్ వేటు వేసింది. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై వేటు ప‌డింది. కనీసం మాస్కులకు కూడా నిధులు లేవంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి రిలీజ్ చేసిన‌ సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన మీద సీరియస్ అయిన ప్ర‌భుత్వం.. నిబంధనలకు విరుద్ధంగా గ‌వ‌ర్న‌మెంట్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ సస్పెండ్ చేసింది. అంతేకాదు వెంకట్రామిరెడ్డిని నగరి దాటి […]

రోజాపై పొగ‌డ్త‌లు...ప్ర‌భుత్వంపై విమ‌ర్మ‌లు..మున్సిపల్ కమిషనర్‌ స‌స్పెండ్
Follow us on

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ స‌ర్కార్ మరో అధికారి మీద సస్పెన్షన్ వేటు వేసింది. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై వేటు ప‌డింది. కనీసం మాస్కులకు కూడా నిధులు లేవంటూ మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి రిలీజ్ చేసిన‌ సెల్ఫీ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన మీద సీరియస్ అయిన ప్ర‌భుత్వం.. నిబంధనలకు విరుద్ధంగా గ‌వ‌ర్న‌మెంట్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ సస్పెండ్ చేసింది. అంతేకాదు వెంకట్రామిరెడ్డిని నగరి దాటి వెళ్లొద్దని ఆదేశించింది. కాగా నగరి మున్సిపాలిటీ ఇన్ చార్జి కమిషనర్‌గా శానిటరీ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావును నియమించినట్టు స‌మాచారం.