సొంత పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రోజా..

|

Jan 06, 2020 | 3:04 PM

ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజాపై దాడి యత్నం చినికి చినికి గాలివానగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. ఈ మేరకు పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంపత్,  అంబు, సరళ, రామ్మూర్తి తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విత్, 149 […]

సొంత పార్టీ కార్యకర్తలపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రోజా..
Follow us on

ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే రోజాపై దాడి యత్నం చినికి చినికి గాలివానగా మారుతోంది. సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టే వరకు వెళ్లింది వ్యవహారం. ఈ మేరకు పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. కేబీఆర్‌పురంలో గ్రామ సచివాలయ భూమిపూజకు వెళ్లిన సమయంలో సురేష్, రిషేంద్ర, హరీష్, సంపత్,  అంబు, సరళ, రామ్మూర్తి తనపై దాడికి యత్నించారని రోజా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 143,341,427,506, 509 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పుత్తూరు పోలీసులు.

పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆందోళలనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా తమ పార్టీకి చెందిన అమ్ములు వర్గమే దాడి చేయించిందని ఆరోపించిన రోజా.. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు రోజా ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమ్ములు వర్గం ఆరోపణలు చేస్తోంది.