Nag Ashwin Prabhas Movie: ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త.. నాగ్‌ అశ్విన్‌ సినిమా నుంచి రెండు కొత్త అప్‌డేట్‌లు రానున్నాయి..

|

Jan 24, 2021 | 3:43 PM

Nag Ashwin Prabhas Movie Updates: 'సాహో' చిత్రం తర్వాత ప్రభాస్‌ అభిమానులు ఆయన కొత్త సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ సినిమాలపై ఇప్పుడు..

Nag Ashwin Prabhas Movie: ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త.. నాగ్‌ అశ్విన్‌ సినిమా నుంచి రెండు కొత్త అప్‌డేట్‌లు రానున్నాయి..
Follow us on

Nag Ashwin Prabhas Movie Updates: ‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్‌ అభిమానులు ఆయన కొత్త సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాహుబలితో ఒక్కసారిగా ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ సినిమాలపై ఇప్పుడు యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిపడింది.


ఈ క్రమంలోనే ప్రభాస్‌కు కూడా తన తర్వాతి చిత్రాలను పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. కథా, దర్శకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. వీటిలో ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రకటన చేసి చాలా రోజులవుతున్నప్పటికీ అప్‌డేట్‌ మాత్రం ఇవ్వలేదు. దీంతో నాగ అశ్విన్‌కు ప్రభాస్‌ అభిమానులు ఈ విషయమై ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగ అశ్విన్‌ బదులిస్తూ.. ఈ సినిమాకు సంబంధించిన రెండు కొత్త అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. దీనిపై అశ్విన్‌ స్పందిస్తూ.. ‘కచ్చితంగా ఈ జనవరి 29న ఒకటి.. ఫిబ్రవరి 26న మరొకటి.. అప్‌డేట్స్‌ అందించనున్నాం’ అని స్పష్టత ఇచ్చారు. సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్న క్రమంలో వస్తోన్న అప్‌డేట్‌తో అందరిలో ఆసక్తినెలకొంది.

Also Read: అచ్చ తెలుగు యాప్ ‘ఆహా’ ఖాతాలో మరో విజయం.. ‌’సూపర్‌ ఓవర్’‌ అదుర్స్ అంటున్న మూవీ లవర్స్