ఎన్‌డీ తివారి కుమారుడిది హత్యే.. పోస్టుమార్టంలో బయటపడ్డ నిజాలు

| Edited By: Ram Naramaneni

Apr 20, 2019 | 6:57 AM

ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 16న మృతి చెందిన రోహిత్ శేఖర్ ది హత్యేనని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఫోరెన్సిక్‌, క్రైమ్‌ బ్రాంచ్ బృందాలు ఆయన నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు రోహిత్‌ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, […]

ఎన్‌డీ తివారి కుమారుడిది హత్యే.. పోస్టుమార్టంలో బయటపడ్డ నిజాలు
Follow us on

ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్‌ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ నెల 16న మృతి చెందిన రోహిత్ శేఖర్ ది హత్యేనని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇక ఫోరెన్సిక్‌, క్రైమ్‌ బ్రాంచ్ బృందాలు ఆయన నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి. మరోవైపు రోహిత్‌ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, అతడిది సహజ మరణమేనని రోహిత్‌ తల్లి ఉజ్వలా తివారీ పేర్కొన్నారు. శేఖర్‌ మృతి చెందడానికి ఒక రోజు ముందు ఉత్తరాఖండ్‌ బయల్దేరి వెళ్లారని సమాచారం. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014లో తివారీ రోహిత్ శేఖర్ ను కొడుకుగా అంగీకరించక తప్పలేదు. ఇక ఆ సమయంలో రోహిత్ శేఖర్ పేరు బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.