aung san suu kyi: మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ కోర్టు విచారణను ఎదుర్కోవలసిందే…

| Edited By: Phani CH

May 22, 2021 | 8:19 PM

మయన్మార్ లో పదవీచ్యుతురాలైన ఆంగ్ సాన్ సూకీ ఆరోగ్యాంగా ఉన్నారని, రేపో, మాపో ఆమె కోర్టు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని సైనిక బలగాల నేత మిన్ ఆంగ్ హెయిలింగ్ తెలిపారు.

aung san suu kyi: మయన్మార్ లో ఆంగ్ సాన్ సూకీ కోర్టు విచారణను ఎదుర్కోవలసిందే...
Myanmar Junta Leader
Follow us on

మయన్మార్ లో పదవీచ్యుతురాలైన ఆంగ్ సాన్ సూకీ ఆరోగ్యాంగా ఉన్నారని, రేపో, మాపో ఆమె కోర్టు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని సైనిక బలగాల నేత మిన్ ఆంగ్ హెయిలింగ్ తెలిపారు. గత ఫిబ్రవరి 1 న సైనిక కుట్ర జరిగి సూకీని పదవీచ్యుతురాలిని చేసిన అనంతరం ఈ నేత ఇలా ఓ ఛానల్ కి మొదటిసారిగా ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయం చెప్పారు. పదేళ్లుగా ఈ దేశంలో సైనిక పాలనపై పోరాటం చేసిన నోబెల్ బహుమతి గ్రహీత సూకీని మిలిటరీ ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మయన్మార్ లో పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. పోలీసులు, సైనికుల కాల్పుల్లో సుమారు 400 మందికి పైగా మరణించగా అనేకమంది గాయపడ్డారు. సైనికాధికారుల ఆదేశాలను పాటించలేక పలువురు పోలీసులు ఇండియాలో మిజోరం రాష్ట్రానికి రహస్యంగా తరలి వచ్చారు. ఇక్కడ తమను శరణార్థులుగా ఉండేందుకు అనుమతించాలని కోరారు. కాగా ఆందోళనలకు దిగిన 4 వేలమంది ఇంకా సైనిక ప్రభుత్వ నిర్బంధంలోనే ఉన్నారు. 75 ఏళ్ళ ఆంగ్ సాన్ సూకీకి దేశంలో కోట్లాది మద్దతుదారులు, అభిమానులు ఉన్నారు. ఆమె తెచ్చిన ప్రజాస్వామ్య సంస్కరణలను సైనిక ప్రభుత్వం తుంగలో తొక్కింది. అయితే ఆమె తాను చేయాల్సింది చేసింది అని మిన్ ఆంగ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు..

ఆంగ్ సాన్ సూకీ సోమవారం రాజధాని నెపిడాలోని కోర్టులో స్వయంగా హాజరు కావలసి ఉంది. ఇప్పటివరకు ఆమెను వీడియో లింక్ ద్వారా కోర్టు విచారించింది. అయితే తన లాయర్లతో నేరుగా మాట్లాడేందుకు సైనిక ప్రభుత్వం అనుమతించాల్సి ఉంది. దేశంలో ప్రతి రోజూ ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా ఆమెకు ఈ సౌకర్యం కల్పించేందుకు ఈ మిలిటరీ ప్రభుత్వం నిరాకరిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mahesh Babu Fans: ఈ నెలాఖరులో ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ.. రికార్డులు బ్రేక్ చెయ్య‌డానికి వేయి క‌ళ్ల‌తో వెయిటింగ్

SBI Report on Corona: కరోనా నియంత్రణకు టీకానే శరణ్యం.. కరోనా తీవ్రతపై ఎస్బీఐ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..