అంతా నా ఇష్టం…నాకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తా..

|

Sep 07, 2020 | 8:32 PM

సినిమా అనేది కేవ‌లం జీవితంలో ఓ భాగం మాత్ర‌మేన‌ని..సినిమానే జీవితం కాద‌ని శృతిహాస‌న్ చెప్పింది. చిట్ చాట్ లో శృతిహాస‌న్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ..ఎవ‌రైనా బాలీవుడ్

అంతా నా ఇష్టం...నాకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తా..
Follow us on

శృతిహాస‌న్.. పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కమల్ హాసన్ ముద్దుల తనయ. అంతే కాదు తన నటనతో కొద్దికాలంలోనే అందరిని మెప్పించింది. ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ త‌ర్వాత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏ విషయం అయినా ముక్కుసూటిగా త‌న అభిప్రాయాన్ని చెప్పేస్తుంది. సినిమా అనేది కేవ‌లం జీవితంలో ఓ భాగం మాత్ర‌మేన‌ని..సినిమానే జీవితం కాద‌ని శృతిహాస‌న్ చెప్పింది. చిట్ చాట్ లో శృతిహాస‌న్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ..ఎవ‌రైనా బాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు పొంద‌క‌పోతే.. ఇక కెరీర్ కు ముగింపు ప‌ల‌కాల్సిన స‌మ‌యం వ‌చ్చిన‌ట్టు కాదంది.

ద‌క్షిణాది సినీప‌రిశ్ర‌మ‌లో ఓ న‌టిగా ఉన్నందుకు నేను చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అని తెలిపింది. తెలుగు, త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కే నా తొలి ప్రాధాన్య‌త అని స్పష్టం చేసింది. నేను ఎవ‌రి స‌ల‌హాను తీసుకోను… నాకు న‌చ్చిన‌ట్టు నా స్టైల్ లో జీవిస్తాను అంటోంది. నా మ‌న‌స్సుకు ద‌గ్గ‌ర‌గా ఉండే సినిమాలు మాత్ర‌మే నేను చేస్తాన‌ని చెప్పుకొచ్చింది ఈ సుందరి.